✕
Honey Rose Stunning Looks : కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేరళ కుట్టి హనీ రోజ్.!
By EhatvPublished on 7 Feb 2023 5:38 AM GMT

x
Honey Rose Stunning Looks and photos
-
- ఆమె పేరుకు తగ్గట్టే తేనెలో ముంచిన గులాబిలా ఉంటుంది. రీసెంట్ గా ఈ రోజ్ బ్యూటీ ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకోవడంతో పాటు యూత్ ను తన వలలో వేసుకుంది.
-
- తన అందాలతోనే కాకుండా నటనతోనూ ఆడియన్స్ ను మెప్పించింది. ఈ బొద్దుగుమ్మ పుట్టింది,పెరిగింది కేరళలోని మూలమట్టం. అదే ఊరిలో ఎస్.హెచ్. ఈ. ఎం హైస్కూల్ నుంచి స్కూల్ విద్యను పూర్తి చేసి.. సెయింట్ థెరిస్సా జేవియర్ ఉమెన్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను సంపాదించింది. ఇక కెరీర్ విషయనికి వస్తే.. 14 ఏళ్ల వయస్సులో అంటే 2005లో ’బాయ్ ఫ్రెండ్‘ (మళయాళం సినిమా) తో యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.
-
- ఈ రోజ్ బ్యూటీ 2008లో ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక ఆ తర్వాత 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో నటించింది ఈ అమ్మడు.
-
- అంతకంటే ముందు 2012లో చేసిన మలయాళం సినిమా ‘త్రివేండ్రం లాడ్జ్‘ మంచి పేరు సంపాదించింది. షోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను అప్ డేట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ కేరళ కుట్టి.

Ehatv
Next Story