ఎవరు అవునన్నా కాదన్నా మనకు వెబ్‌ సిరీస్‌ల పట్ల ఆసక్తి పెరగడానికి కారణం మీర్జాపూర్‌ సిరీసే(Mirzapur Series)!

ఎవరు అవునన్నా కాదన్నా మనకు వెబ్‌ సిరీస్‌ల పట్ల ఆసక్తి పెరగడానికి కారణం మీర్జాపూర్‌ సిరీసే(Mirzapur Series)! ఇప్పటికే రెండు భాగాలు అమెజాన్‌ ప్రైమ్‌(Amazon prime) వీడియోలో స్ట్రీమింగ్‌ అయి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మీర్జాపూర్‌ ప్రేక్షకులకు చాలా బాగా కనెక్టయ్యింది. ఇందులోని అన్ని పాత్రలను అభిమానులు ఇష్టపడ్డారు. ఈ సిరీస్‌లో మూడో సీజన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు మేకర్స్‌. ఇటీవలే మూడో సీజన్‌ స్ట్రీమింగ్‌ అయ్యే తేదీని ప్రకటించారు. జులై 5వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ (web series)స్ట్రీమింగ్‌ కాబోతున్నది. ఇందుకు సంబంధించి ట్రైలర్‌ రిలీజయ్యింది. దీనికి మంచి స్పందన వస్తున్నది. సీజ‌న్ 2 ఎండింగ్‌లో మున్నా (Divyendhu Sharma) గుడ్డు (Ali Fasal) చేతిలో చ‌నిపోయిన తర్వాత మీర్జాపూర్‌ సింహాసనం గుడ్డు కాళ్ల దగ్గరకు వస్తుంది. అయితే ఖాలీన్ భయ్యా (pankaj tripati) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు దక్కించుకోగలడా? గుడ్డును చంపేసి మీర్జాపూర్‌ను హస్తగతం చేసుకోవాలని ఆశపడుతున్న స్థానిక ముఠాలు ఏం చేశాయి? గుడ్డు ఎలా వారిని ఎదుర్కోన్నాడు? అన్నది సీజన్ 3లో చూపించబోతున్నారు. శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్‌, హర్షిత గౌర్‌, విజయవర్మ ముఖ్య భూమికలను పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్‌, ఆనంద్ అయ్య‌ర్ దర్శకత్వం వహిస్తున్నారు.


Eha Tv

Eha Tv

Next Story