శ్రీలీల భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి.
విజయవంతమైన తెలుగు, కన్నడ చిత్రాలలో నటించిన ఆమె 2019లో కిస్‌ చిత్రంతో అరంగేట్రం చేసింది. దీనికిగాను సైమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ ఆమెకు వరించింది. ఆ తరువాత భరతే (2019), పెళ్లి సందడి (2021), బై టూ లవ్ (2022) వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.
2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక తెలుగు కుటుంబంలో శ్రీలీల జన్మించింది.ఆమె కర్ణాటకలోని బెంగుళూరులో పెరిగారు.
ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. స్వర్ణలత పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును వివాహం చేసుకుని, విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది.
శ్రీలీల తన చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ప్రారంభించింది.
ఆమె డాక్టర్ అవ్వాలని ఆకాంక్షించి, 2021 నాటికి ఎం.బి.బి.ఎస్ చివరి సంవత్సరంలో అడుగుపెట్టింది.
శ్రీలీల 2022 ఫిబ్రవరిలో గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. అనాథాశ్రమంలో వారిని చూసి చలించి శ్రీలీల ఇలా పసి పిల్లలను చేరదీయడం గమనార్హం.