Asia Cup India vs Bangladesh : శుభ్‌మన్ గిల్ సెంచరీ వృథా.. భారత్‌పై బంగ్లా థ్రిల్లింగ్ విక్టరీ..!
ఆసియా కప్-2023లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఓటమిని చవిచూసింది. ఆసియాకప్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి అవడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

Bangladesh stun India for consolation win
ఆసియా కప్(Asia Cup)-2023లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh)పై భారత్(India) ఓటమిని చవిచూసింది. ఆసియాకప్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి అవడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది. సమాధానంగా టీమిండియా(Teamindia) 259 పరుగులు చేసి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
బంగ్లా ఇన్నింగ్సులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) 80 పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ 54, నసుమ్ అహ్మద్ 44 పరుగులు చేశారు. భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) మూడు వికెట్లు, మహ్మద్ షమీ(Mohammad Shami) రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్(Prasiddh Krishna), అక్షర్(Axar), జడేజా(Jadeja)లకు ఒక్కో వికెట్ దక్కింది.
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 10 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభ్‌మన్ గిల్ 121 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 42 పరుగులు చేసి అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. అయితే చివర్లో తడబడటంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బాంగ్లా జట్టులో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లు, మహేదీ హసన్, తంజిమ్ హసన్ చెరో రెండు వికెట్లు తీయగా.. షకీబ్, మెహదీలకు ఒక్కో వికెట్ దక్కింది.
