దక్షిణాఫ్రికాతో(South africa) జరిగే టి-20 సిరీస్‌కు(t-20 series) భారత జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది.

దక్షిణాఫ్రికాతో(South africa) జరిగే టి-20 సిరీస్‌కు(t-20 series) భారత జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్(surya kumar yadav) టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. నవంబర్ 8న డర్బన్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. నవంబర్‌ 10న డర్బన్‌లోనే రెండో మ్యాచ్‌ ఆడనుండగా.. నవంబర్ 13న సెంచూరియన్‌లో మూడో మ్యాచ్, జోహన్నెస్‌బర్గ్‌లో నాలుగో మ్యాచ్‌ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

Updated On
Eha Tv

Eha Tv

Next Story