BCCI strong warning:

ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ కు ముందు ఆటగాళ్లకు బిసిసిఐ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌- శ్రీలంక మధ్య క్రికెట్ సంబంధాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తెలిపింది. శ్రీలంక క్రికెట్ ఛారిటీ మ్యాచ్‌ల కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ, వాణిజ్య కారణాల వల్ల బీసీసీఐ ఈ ప్రణాళికను ఆమోదించలేదు, అయితే ఆగస్టులో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ యథావిధిగా కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టులో భారత జట్టు పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని SLC అధ్యక్షుడు షమ్మీ సిల్వా స్పష్టం చేశారు. ఈ పర్యటనలో, రెండు జట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ సిరీస్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. దిత్వా తుఫాను బాధితులకు నిధులు సేకరించడానికి డిసెంబర్‌లో భారతదేశంతో రెండు T20 ఛారిటీ మ్యాచ్‌లు ఆడాలని శ్రీలంక క్రికెట్ ప్రతిపాదించింది. అయితే, వాణిజ్య ఒప్పందాన్ని సకాలంలో ఖరారు చేయలేకపోవడంతో BCCI ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. అయితే టి-20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌కు ముందు భారత ఆటగాళ్లు ఎలాంటి మ్యాచ్‌లు ఆడకూడదని బీసీసీఐ భారత క్రికెటర్లను హెచ్చరించింది.

Updated On
ehatv

ehatv

Next Story