రిషబ్ పంత్‌ను మ్యాచ్ విన్నర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభివర్ణించాడు.

రిషబ్ పంత్‌ను మ్యాచ్ విన్నర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభివర్ణించాడు. రిషబ్ పంత్‌ ఇంత తక్కువ సమయంలో తన దేశం కోసం ఏం చేసాడనేది.. అతడు ఎంత‌ గొప్ప ఆడ‌గాడో తెలిపేందుకు నిదర్శనమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పంత్ ఈ సంవత్సరం ప్రారంభంలో గాయం నుండి అద్భుతమైన పునరాగమనం చేసాడు. దేశం కోసం మూడు ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

స్కై స్పోర్ట్స్‌తో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. మేమంతా అతను ఆడటం చూశాం. స్టంప్ మైక్‌లో అతని గొంతును విన్నాము. అతడు తన ఆట‌ను ప్రేమిస్తాడు, అతడో విజేత. అతడు కేవలం కొన్ని పరుగులు చేయ‌డం కోసం.. సరదా కోసం ఆడడు. తక్కువ టెస్టుల్లో 5 సెంచరీలు సాధించాడు. ఎంఎస్ ధోని 90 టెస్టులు ఆడి 6 సెంచరీలు చేశాడు. ఈ వ్యక్తి పంత్ ఎంత మంచి ఆట‌గాడో దీన్ని బట్టి తెలుస్తుంది. అతడు సీరియస్ క్రికెటర్.

పంత్ ఇటీవలే దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇండియా బి తరఫున ఆడాడు. అయితే అతడు రెండు ఇన్నింగ్సుల‌లో వ‌రుస‌గా 7, 61 పరుగులు చేశాడు. అతడు కుల్దీప్ యాదవ్‌తో సరదాగా కనిపించాడు. ప్రత్యర్థి జట్టు సర్కిల్‌లోకి కూడా ప్రవేశిస్తాడు. అయితే ఇవి పంత్ పోటీతత్వాన్ని తగ్గించలేవ‌ని పాంటింగ్ చెప్పాడు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story