IND vs WI 3rd ODI : నేడు చివరి వన్డే.. టీమిండియా సిరీస్ సాధించేనా..?
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో నిర్ణయాత్మక చివరి మరియు మూడవ వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

Brian Lara Cricket Academy Pitch Report For IND vs WI 3rd ODI 2023
వెస్టిండీస్(Westindies)తో జరిగిన రెండో వన్డే(Second ODI)లో భారత జట్టు(Teamindia) 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో నిర్ణయాత్మక చివరి మరియు మూడవ వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మూడో వన్డే(Third ODI) ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం(Brian Lara Stadium)లో జరగనుంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఒక్క వన్డే మ్యాచ్(ODI Match) కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రియాన్ లారా పిచ్ ఎవరికి లాభం చేకూర్చనుందనేది ఆసక్తికరంగా మారింది.
వెస్టిండీస్‌లోని కొత్త క్రికెట్ గ్రౌండ్(Cricket Stadium)లలో బ్రియాన్ లారా స్టేడియం ఒకటి. ఈ స్టేడియం తొలిసారిగా పురుషుల వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. గతంలో ఈ మైదానంలో 2022లో భారత్, వెస్టిండీస్(India vs Westindies) మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్(India) విజయం సాధించింది. ఈ స్టేడియం 2007లో నిర్మించబడింది. ఇందులో మొత్తం 15,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది.
ఈ వేదికపై ఒక T20, మూడు మహిళల వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 160 కాగా.. రెండవ ఇన్నింగ్స్ స్కోరు 147. మూడు మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు ఛేజింగ్ జట్టు గెలవగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు T20 మ్యాచ్‌లో గెలిచింది.
ఈ పిచ్ బ్యాట్స్‌మెన్(Batsman)కు, స్పిన్నర్ల(Spinners)కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మొదట టాస్(Toss) గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నా.. వర్షం పడే అవకాశం 50 శాతం ఉందని చెప్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. 24 డిగ్రీల సెల్సియస్ నుంచి గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత(Temparatures)లు నమోదయ్యే అవకాశం ఉంది.
