Ashleigh Gardner : ప్రియురాలితో ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్ ఎంగేజ్‌మెంట్!
ఆస్ట్రేలియాకు(Australia) చెందిన వుమెన్ క్రికెట్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్(Ashley Gardner) తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్‌ను(Monica Wright) మనువాడపోతున్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంత మంది సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Ashleigh Gardner
ఆస్ట్రేలియాకు(Australia) చెందిన వుమెన్ క్రికెట్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్(Ashley Gardner) తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్‌ను(Monica Wright) మనువాడపోతున్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంత మంది సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాబోయే జంటకు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. 2011 నుంచి ప్రేమలో ఉన్నారు గార్డనర్, మోనికాలు. గార్డనర్ కోసమే క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లేవారు మోనికా! ఆమెకు సపోర్ట్ చేసేవారు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలు. ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించారు ఆష్లీ గార్డనర్. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
