ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే తడుముకోకుండా విరాట్ కోహ్లీ(Virat Kohli) అంటారు. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా సరే కోహ్లీనే నంబర్ వన్ అంటారు.. తమకు బాబర్ ఆజం(Babar Azam) ఉన్నా పాక్‌లో కూడా కోహ్లీకే ఓటేస్తారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్(Harbhajan Singh)కు మాత్రం మరో ఓపినీయన్ ఉంది. ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్న రాజస్తాన్ రాయల్స్(Rajastan Rayols) టీమ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్(Jos Buttler)పై ప్రశంసల వర్షం కురిపించిన హర్భజన్ సింగ్

Jos Buttler is the No.1 Batter
ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే తడుముకోకుండా విరాట్ కోహ్లీ(Virat Kohli) అంటారు. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా సరే కోహ్లీనే నంబర్ వన్ అంటారు.. తమకు బాబర్ ఆజం(Babar Azam) ఉన్నా పాక్‌లో కూడా కోహ్లీకే ఓటేస్తారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్(Harbhajan Singh)కు మాత్రం మరో ఓపినీయన్ ఉంది. ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్న రాజస్తాన్ రాయల్స్(Rajastan Rayols) టీమ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్(Jos Buttler)పై ప్రశంసల వర్షం కురిపించిన హర్భజన్ సింగ్ అతడే వరల్డ్ నంబర్‌వన్ అంటూ కితాబిచ్చాడు. హర్భజన్‌సింగ్ అన్నాడని కాదు కానీ నిజంగానే జోస్ బట్లర్ ఇప్పుడు బ్రహ్మాండమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 204 పరుగులు చేశారు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. అసలు బట్లర్‌ను ఏమని పొగడాలో కూడా తెలియడం లేదని , అతడు వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడని హర్భజన్ అన్నాడు. ఎలాంటి పిచ్‌పైనైనా ఆడగల సమర్థుడని అన్నాడు. క్రీజ్‌ను తనకు తగ్గట్టుగా ఉపయోగించే సామర్థ్యం బట్లర్‌లోనే ఉందని హర్భజన్ తెలిపాడు. 'బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. స్పిన్నర్లను కూడా బట్లర్ సమర్థంగా ఎదుర్కోగలడు. నా వరకు అయితే ప్రస్తు ప్రపంచ క్రికెట్‌లో అతడే నంబర్‌వన్ బ్యాటర్' అని హర్భజన్ అన్నాడు. అయితే ప్రపంచ టీ20 క్రికెట్‌ను ప్రస్తుతం శాసిస్తున్న బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్, విరాట కోహ్లి, రిజ్వాన్ పేర్లను హర్భజన్‌సింగ్ అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
