వన్డే ప్రపంచకప్‌లో(One day world cup) పాకిస్తాన్‌(Pakistan) టీమ్‌ను అఫ్గనిస్థాన్‌(Afganistan) జట్టు మట్టికరిపించిన విషయం తెలిసిందే! ఓడిపోయిన బాధలో ఉన్న పాకిస్తాన్‌ను అఫ్గనిస్తాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌(Ibrahim Zadran) కుమిలిపోయేలా చేశాడు. పాక్‌ను సిగ్గుతో తలదించుకునేలా చేశాడు.

వన్డే ప్రపంచకప్‌లో(One day world cup) పాకిస్తాన్‌(Pakistan) టీమ్‌ను అఫ్గనిస్థాన్‌(Afghanistan) జట్టు మట్టికరిపించిన విషయం తెలిసిందే! ఓడిపోయిన బాధలో ఉన్న పాకిస్తాన్‌ను అఫ్గనిస్తాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌(Ibrahim Zadran) కుమిలిపోయేలా చేశాడు. పాక్‌ను సిగ్గుతో తలదించుకునేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెల్చుకున్నాడు జద్రాన్‌. అవార్డు అందుకుంటున్నప్పుడు జద్రాన్‌ మాట్లాడుతూ 'నేను ఈ అవార్డును పాకిస్తాన్‌ నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన నా అప్ఘనిస్తాన్‌ ప్రజలకు అంకితమిస్తున్నాను' అని అన్నాడు. ఇప్పుడు జద్రాన్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాలుగు దశాబ్దాల నుంచి అఫ్గనిస్తాన్ అష్టకష్టాలను అనుభవిస్తోంది. అంతర్యుద్ధాలతో అతలాకుతలం అయ్యింది. తాలిబన్ల(Taliban) హింసకు తాళలేక లక్షలాది మంది అఫ్గనిస్తాన్‌ ప్రజలు తలదాచుకోవడానికి పాకిస్తాన్‌కు వచ్చారు. అఫ్గన్‌ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబన్ల పాలన మొదలయ్యింది. దాంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పాకిస్తాన్‌లో(Pakistan) ఆశ్రయం పొందిన అఫ్గనిస్తాన్‌ ప్రజలు ఇక్కడ శరణార్థి శిబిరాలలో, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

ఇలా జీవిస్తున్నవారు 17 లక్షలకు పైగానే ఉంటారు. వీరిందరని వెంటనే ఖాళీ చేయమని ఈ నెల మొదట్లో పాకిస్తాన్‌ ప్రభుత్వం హఠాత్తుగా ఆదేశించింది. నవంబర్‌ 1వ తేదీలోపు దేశాన్ని వీడాలని హుకుం జారీ చేసింది. దీంతో గతిలేక అఫ్గనిస్తాన్‌ ప్రజలు పాకిస్తాన్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. అక్టోబర్‌ 21న కూడా 3,248 అఫ్గన్‌ జాతీయులు దేశాన్ని వీడినట్లు పాకిస్తాన్‌ రేడియో ప్రకటించింది. ఇప్పటి వరకు 51 వేల మందిని దేశం నుంచి పంపించినట్టు పాక్‌ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై అఫ్గన్‌ వాసుల్లో అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది. తాజాగా జద్రాన్‌ ప్రకటనతో అఫ్గన్‌ శరణార్థులకు సంఘీభావం తెలిపినట్లయ్యింది.

Updated On 24 Oct 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story