Indian women's cricket team is amazing in the World Cup match

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగడంతో, 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 341/5 స్కోరుతో ఛేదించింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరగా, ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరపడింది. అంతేకాకుండా, మహిళల, పురుషుల వన్డే ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు సృష్టించింది.

Updated On
ehatv

ehatv

Next Story