ఐపీఎల్(IPL) వేలానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) కెప్టెన్‌గా(Captain) నియమించింది. టోర్నీలో రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ పదేళ్ల పాటు ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా కూడా నిలిపాడు. హార్దిక్ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Hardik Pandya
ఐపీఎల్(IPL) వేలానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) కెప్టెన్‌గా(Captain) నియమించింది. టోర్నీలో రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ పదేళ్ల పాటు ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా కూడా నిలిపాడు. హార్దిక్ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టును రెండుసార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. గుజరాత్ జట్టు 2022లో ఛాంపియన్‌గా నిలిచింది. 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో(Chennai Super Kings) జరిగిన ఫైనల్‌లో ఓడిపోయింది. రాబోయే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున పాండ్యా ఆడనున్నాడు.
2013లో రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్ అయ్యాడు. అతని సారథ్యంలోనే ముంబయి మొత్తం ఐదు టైటిళ్లను గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020లో రోహిత్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
ముంబయి ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్‌ఫార్మెన్స్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే దిశగా ఇదో పెద్ద ముందడుగు. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ అసాధారణమైన నాయకత్వాన్ని కలిగి ఉంది. సచిన్ నుండి హర్భజన్ సింగ్ వరకూ.. రికీ పాంటింగ్ నుండి రోహిత్ శర్మ వరకూ విజయవంతమైన నాయకత్వాన్ని కలిగిఉందని అన్నాడు. భవిష్యత్తు జట్టును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనికి అనుగుణంగానే హార్దిక్ పాండ్యా IPL-2024 సీజన్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని చేపట్టనున్నాడని తెలిపాడు.
