క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi)అభినందనలు తెలిపారు.

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi)అభినందనలు తెలిపారు. 14 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్(IPL) 2025లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royal) తరపున ఆడుతూ రికార్డు సృష్టించిన బీహార్(Bihar)కు చెందిన ఈ యువ క్రికెటర్‌ను మోడీ ప్రశంసించారు. ట్విట్టర్‌లో, "వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) బీహార్ మట్టి నుంచి వచ్చిన మాణిక్యం. ఇంత చిన్న వయస్సులో అతను చూపిన ప్రతిభ, క్రీడా స్ఫూర్తి గొప్ప విజయాలకు నాంది. అతని ఈ ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తుంది," ట్వీట్ చేశారు.
మార్చి 27, 2011, బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలో సూర్యవంశ్ జన్మించాడు. 4 ఏళ్ల వయసులో ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. తండ్రి సంజీవ్ కుమార్ వద్ద తొలి శిక్షణ పొందాడు. 9 ఏళ్ల వయసులో సమస్తిపూర్‌లోని క్రికెట్ అకాడమీలో చేరాడు. 2024లో 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు, రంజీ చరిత్రలో రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 2023లో ఇండియా B అండర్-19 జట్టు తరపున చతుర్ముఖ సిరీస్‌లో ఆడి, 6 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధ సెంచరీలతో 177 పరుగులు చేశాడు. 2024లో ఆస్ట్రేలియా U19 జట్టుపై చెన్నై(Chennai)లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ (104) సాధించాడు, U19 టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. నవంబర్ 2024లో జరిగిన ఐపీఎల్ వేలంలో, 13 ఏళ్ల వయసులో, రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రోత్సాహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals)తో పోటీ పడి రాజస్థాన్ అతన్ని దక్కించుకుంది. ఏప్రిల్ 19, 2025న జైపూర్(Jaipur)లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ తరపున అరంగేట్రం చేశాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టి సంచలనం సృష్టించాడు, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా మ్యాచ్ ఆడిన రికార్డు నెలకొల్పాడు. గత నెలలో గుజరాత్ టైటాన్స్(GT)పై జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడి సెంచరీ. అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 11 సిక్సర్లు కొట్టి, మురళీ విజయ్‌తో సమానంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించాడు.
