బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు.

బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. 170, 180 రన్స్ చేస్తే మ్యాచులు గెలవలేం. 350-400 పరుగులు చేయాలి. ఓటమి విషయంలో ఎవరినీ నిందించలేం. అందరూ రన్స్ చేయాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. సిడ్నీలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌పై 6 వికెట్ల తేడాతో కంగారూలు గెలిచేశారు. దీంతో ఈ సిరీస్ 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

Updated On
ehatv

ehatv

Next Story