The name 'Jemima Rodrigues' is Trending in Indian women's cricket..!

భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో జెమిమా 127* పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియా జట్టు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది మహిళల వన్డేల్లో అత్యధిక టార్గెట్ ఒకటిగా చరిత్రకెక్కింది.

జెమిమా 134 బంతుల్లో 127 రన్స్ చేసి, చివరికి అవసరమైన రెండు రన్లను తీసి విజయాన్ని అందించింది. ఆమె కెరీర్‌లో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. ఆమె తండ్రి క్లబ్‌లో అనధికారిక ఆధ్యాత్మిక సెషన్‌లు నిర్వహిస్తున్నారని రావడంతో చారిత్రాత్మక ఖార్ జింఖానాలో ఆమె సభ్యత్వం అక్టోబర్ 2024లో రద్దు చేశారు. అయితే నవీ ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 127 పరుగులతో అజేయంగా నిలిచిన తర్వాత భారత్ ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది

2017లో అండర్-19 డొమెస్టిక్ వన్డేలో 202* సాధించి, స్మృతి మంధానా తర్వాత రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచారు. 2018లో BCCI జాగ్మోహన్ దల్మియా అవార్డు బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. 2022 ఆసియా కప్, ఆసియన్ గేమ్స్ విజయాల్లో కీలక పాత్ర.

2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. T20 వరల్డ్ కప్ 2018లో డెబ్యూ మ్యాచ్‌లో 50 స్కోరు చేసింది.

జెమీమా రోడ్రిగ్స్ మంగళూరుకు చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించారు... ఈమె జన్మించకముందే తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్, తల్లి లవితా రోడ్రిగ్స్. ఈమె తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉంటారు. ఆమె తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల త్యాగాలు, కృషి అని చెబుతుంటారు. తండ్రి ఇవాన్ ఆమె తొలి గురువు, కోచ్... అతడే కూతురిని క్రీడలవైపు ప్రోత్సహించారు. తల్లి, సోదరులు ఎనోక్, ఏలీ కూడా ఆమెను ప్రోత్సహించారు. ఆమె చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడింది.జెమిమా కుటుంబం మొదట్లో ముంబైలోని భాండుప్‌లో నివసించేది... పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి ఇవాన్ కుటుంబాన్ని బాంద్రా వెస్ట్‌కు మార్చారు. ఇవాన్ రోడ్రిగ్స్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్‌గా పనిచేసేవారు... జెమీమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు

Updated On
ehatv

ehatv

Next Story