భారత క్రికెట్‌కు డిసెంబర్ 6 చాలా ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నారు. ముగ్గురు టీమిండియా క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

భారత క్రికెట్‌కు డిసెంబర్ 6 చాలా ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నారు. ముగ్గురు టీమిండియా క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బూంబూం బుమ్రా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పుట్టినరోజుగా డిసెంబర్‌ 6న జరుపుకుంటున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.

ఈ ముగ్గురిలో సీనియర్‌ రవీంద్ర జడేజా ఎడమ చేతి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో భారత్‌ జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2008-09 రంజీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడేజాకు టీమిండియా ఆఫర్‌ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజాగా నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత జడేజా అంతర్జాతీయ టి-20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్‌, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

మరో ఆటగాడు బూమ్రా 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్‌ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్‌, పేస్‌ కలయికతో ప్రపంచ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా 2016 భారత బుమ్రా అనతికాలంలో సూపర్‌ స్టార్‌ బౌలర్‌ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. టి-20 ఓవర్ల క్రికెట్‌లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం బుమ్రా సొంతం.

ఇంక అందరికంటే చిన్నవాడు శ్రేయస్‌ అయ్యర్‌. శ్రేయస్‌ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి 2017లో టీమిండియాలోకి ఎంటరయ్యాడు. మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్‌లో రికార్డ్‌ ఎక్కువ ఉంది. 2024లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ 2025 సీజన్‌లో పంజాబ్‌ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. 2023 వరల్డ్‌కప్‌లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్‌.. టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు.

Updated On
ehatv

ehatv

Next Story