రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ నిరాశకు గురయ్యాడు

రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ నిరాశకు గురయ్యాడు. వరుసగా రెండో ఓటమి తర్వాత బ్రూక్ మాట్లాడుతూ.. తమ జట్టులోని ఆటగాళ్లలో ఎక్కువ మంది యువకులే. జట్టుకు ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఎదుర్కొనే అనుభవం లేదు.. కానీ తిరిగి పుంజుకుంటుంది అని కార‌ణం చెప్పాడు.

మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. 270 పరుగులకే పరిమితం చేసేందుకు మేము బాగా బౌలింగ్ చేశామని అనుకుంటున్నాను. హెడింగ్లీలో బౌలింగ్ చేయడం కష్టం. పవర్‌ప్లేలో మేము వికెట్లు కోల్పోయాం. అది లక్ష్యాన్ని ఛేదించడం కష్టతరం చేసింది. సెట్ బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతను నిర్వర్తించలేదు. ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు కోల్పోయాం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకదానిని ఎదుర్కొంటున్న అనుభవం లేని జట్టు మా వద్ద ఉంది. చాలా నేర్చుకోవడానికి ప్రయత్నించాం అన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 270 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కారీ అర్ధ సెంచరీలు చేశారు. లక్ష్యాన్ని ఛేదన‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story