ఈ నెల 28న ఆసియా కప్- 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.

ఈ నెల 28న ఆసియా కప్- 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్‌లో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్లలోనూ భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. కాగా గురువారం జరిగిన సూపర్‌-4 పోరులో పాక్‌ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 స్కోరుకు పరిమితమైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అయిదు సార్లు ఇండియా, పాక్ జ‌ట్లు ఫైన‌ల్స్‌లో త‌ల‌ప‌డ్డాయి. వాటిల్లో పాకిస్థాన్‌దే పైచేయి ఉన్న‌ది. అయితే ఈసారి చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్న టీమిండియా.. ఆదివారం ఆసియాక‌ప్ ఫైన‌ల్లో ఏం చేస్తుందో చూడాల్సిందే.

ehatv

ehatv

Next Story