Yuvraj is emotional..ఆ సమయంలో ఒంటరినయ్యా.. అందుకే రిటైర్మెంట్..! యువరాజ్‌ ఎమోషనల్..!

యువరాజ్‌సింగ్‌ భారత క్రికెట్‌లో ఓ దిగ్గజమనే చెప్పాలి. బ్యాట్‌తోనే కాకుండా బాల్‌, ఫీల్డింగ్‌లో కూడా అదరగొట్టేవాడు. 2007 టి-20 వరల్డ్ కప్, 2011-వరల్డ్‌ కప్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. యువరాజ్‌ లేకుంటే ఆ రెండు టోర్నీలు దక్కకపోయి ఉండేవనే చర్చ కూడా వచ్చింది. యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో క్యాన్సర్‌ వ్యాధి వచ్చినా..ధృడంగా నిలబడి ఆడాడు. ప్లేయర్ ఆఫ్‌ ద టోర్నీ సొంతం చేసుకున్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యువరాజ్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఎవరూ తనతో మాట్లాడటం లేదన్న బాధ కలిగిందని. ఎవరూ తన ఆటను గౌరవించడం లేదని బాధపడ్డానని ఆయన చెప్పుకొచ్చాడు. సానియామీర్జాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలు వెల్లడించారు. అంతేకాదు.. శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అనిపించిందని. 2019లో ప్రపంచకప్‌ నడుస్తున్న సమయంలో రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆడటంలో ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించానని యువరాజ్‌ తెలిపారు. భవిష్యత్‌లో భారత క్రికెట్‌ రంగంలోకి వస్తారా అంటే ప్రస్తుతం తన పిల్లలే తనకు ప్రపంచమని, వారితోనే సమయాన్ని గడుపుతున్నానని చెప్పాడు. తనకు చిన్నప్పుడు టెన్నిస్ ఆడాలని ఉండేదని, క్రికెట్‌ తనపై బలవంతంగా రుద్దారని, తన తండ్రే కోచ్‌గా వ్యవహరించేవాడన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story