India vs England, 1st Test : పోరాడుతున్న ఇంగ్లండ్.. ఫలితం ఈరోజే డిసైడ్ అయ్యేలా ఉందే..!
హైదరాబాదు(Hyderabad)లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) పోరాడుతూ ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 పరుగులు చేసింది.

India vs England 1st Test Day 3 Cricket Match highlights
హైదరాబాదు(Hyderabad)లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) పోరాడుతూ ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓలీ పోప్(Ollie Pope) సెంచరీ సాధించి జట్టుకు అండగా నిలిచాడు. పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. పోప్ కు తోడుగా రెహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఫోక్స్ 34 పరుగులు చేసి అక్షర్ పటేల్(Axar Patel) బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే(Zak Crawley) 31, బెన్ డకెట్ 47 పరుగులు చేశారు. జో రూట్ (2), జానీ బెయిర్ స్టో (10), కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) నిరాశపరిచారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ 2, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులు చేయగా, టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది.
