భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జూన్ నుంచి ఆగస్టు 2025 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.

భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జూన్ నుంచి ఆగస్టు 2025 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇది 2025-2027 వరల్డ్ టెస్ట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు హెడ్డింగ్లీ, లీడ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. శుభ్‌మన్ గిల్(Shubman Gill) కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. హర్షిత్ రానా జట్టులో చేరాడు. కరుణ్ నాయర్ బ్యాటింగ్‌ చేయగలడు కానీ అతను చాలా కాలం తర్వాత టెస్ట్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ జట్టులో బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ వంటి బ్యాటర్లు, వోక్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ వంటి బౌలర్లతో బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ సొంత గడ్డపై ఆడుతుండటం, బలమైన జట్టుతో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. భారత యువ జట్టు సవాల్‌ను ఎదుర్కొంటుంది, కానీ గిల్ నాయకత్వంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. 2021-22లో భారత్-ఇంగ్లాండ్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. 2024లో ఇంగ్లాండ్ భారత్‌లో ఆడిన సిరీస్‌లో భారత్ 4-1తో గెలిచింది.

Updated On
ehatv

ehatv

Next Story