India VS Pakisthan: భారత్-పాకిస్తాన్..!! ఒకే రోజు రెండు క్రికెట్ మ్యాచ్‌లు..!!!
India VS Pakisthan: భారత్-పాకిస్తాన్..!! ఒకే రోజు రెండు క్రికెట్ మ్యాచ్‌లు..!!!

భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ నెలకొంటుంది. భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు వరల్డ్ కప్ లేదా ఆసియా కప్‌ల సమయంలోనే ఉంటాయి. కానీ ఇప్పుడు, ఒకే రోజున రెండు దేశాల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న, భారత్ -పాకిస్తాన్ ‘ఏ’ జట్లు మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టుతో సహా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లోని అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండు జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నేపాల్ కూడా ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, యిలాండ్ ఉన్నాయి. భారత జట్టు మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 13న UAEతో జరుగుతుంది. తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగుతుంది.
భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు, రెండో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అదే రోజు భారత్-పాకిస్తాన్ మధ్య పురుషుల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ముగుస్తుంది. దీంతో ఒకే రోజు రెండు జట్లు పాకిస్తాన్‌తో తలపడనున్నాయి.


