Ishan Kishan : వివాదాల తర్వాత సవాళ్లకు సిద్ధమైన ఇషాన్ కిషన్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.

Ishan Kishan Reaction Viral, Preparing Himself For Future Challenges After Indian Team Announced For England
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్(England)తో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan)కు చోటు దక్కలేదు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఈ విషయాలను ఖండించినప్పటికీ.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఆడి తిరిగి జట్టులోకి రావాలని ఇషాన్‌కు సలహా ఇచ్చాడు. ఈ వివాదం తర్వాత ఇషాన్ సోషల్ మీడియా(Social Media)లో ఒక పోస్ట్ చేసాడు. రాబోయే సవాళ్లు, సమస్యలను తాను ఎలా సిద్ధం అవుతున్నానో చెప్పాడు.
ఇషాన్ కిషన్ 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడు దుబాయ్(Dubai) పర్యటనకు వెళ్లడం, టెలివిజన్ గేమ్ షో(TV Game Show)లో కనిపించడం వల్ల టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని నివేదికలు తెలిపాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20కి ఇషాన్ కిషన్ ఎంపికకు అందుబాటులోకి రాలేదని ద్రవిడ్ చెప్పాడు. ఆ తర్వాత ఇషాన్ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు సెలక్ట్ కాకపోగా.. అతని స్థానంలో కెఎస్ భరత్‌తో పాటు ధృవ్ జురెల్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.
🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc
— Ishan Kishan (@ishankishan51) January 12, 2024
తాజాగా IPL రాబోయే సీజన్ లో పాల్గొనకుండా ఇషాన్ కిషన్ పై చర్య తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాల నడుమ ఇషాన్ కిషన్ శిక్షణను తిరిగి ప్రారంభించాడు. మైదానంలో ధ్యానం, శిక్షణ పొందుతున్న వీడియోను కిషన్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. తాను ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఆది, బుధవారాల్లో రెండో, మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది.
