Joe Root : ఒక్క ఇన్నింగ్సుతో ద్రవిడ్, లారా రికార్డ్ బ్రేక్ చేసి.. సచిన్‌తో సమంగా నిలిచాడు
ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

Joe Root surpassed Rahul Dravid and equals Sachin Tendulkar big Test Record
ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్(Ashes Series)లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా(England vs Australia) మధ్య ఓవల్ మైదానం(Oval Stadium)లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్(Second Inings)లో 395 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 106 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. అయితే.. జో రూట్ సెంచరీ(Century) మిస్సయినా.. ఈ క్రమంలోనే భారీ రికార్డు సాధించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో.. జో రూట్ భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును సమం చేశాడు. జో రూట్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకూ 90 సార్లు అర్ధసెంచరీకి పైగా స్కోర్లు సాధించాడు. అందులో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రూట్.. టెస్టు సిరీస్‌లలో అత్యధిక సార్లు 300కి పైగా పరుగులు చేసిన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara)లను రూట్ అధిగమించాడు. జో రూట్ 19వ సారి ఈ ఫీట్ చేయగా.. ద్రవిడ్, లారా 18-18 సార్లు ఈ ఘనత సాధించారు. అయితే.. సచిన్ టెండూల్కర్ కూడా 19 సార్లు 300 ప్లస్ స్కోర్లు సాధించి టాప్‌లో ఉండగా.. జో రూట్ ఇప్పుడు సమం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting), ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్(Cook)లు 17 సార్లు ఈ ఘనత సాధించారు.
