భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ లాసాన్‌లో అండర్సన్ పీటర్స్ కంటే వెనుకబడ్డాడు. నీరజ్ తొలి నాలుగు ప్రయత్నాల్లో రాణించలేక నాలుగో స్థానంలో నిలిచి ఐదో ప్రయత్నంలో సత్తా చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు. ఆఖరి ప్రయత్నంలో నీరజ్ 89.49 మీటర్లు విసిరి ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి రెండో స్థానంలో నిలిచాడు.

గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ ఆరో ప్రయత్నంలో 90.61 మీటర్ల రికార్డు త్రో విసిరి విజేతగా నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్ల బెస్ట్ త్రోతో మూడో స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిల‌వ‌డం ద్వారా వచ్చే నెలలో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు నీరజ్ అర్హత సాధించాడు. ఆరో ప్రయత్నం వరకు నీరజ్ ఫామ్‌లో కనిపించలేదు. అతడు 82.10 మీటర్ల త్రోతో ప్రారంభించాడు. కానీ చివరికి అతని పారిస్ ఒలింపిక్స్ త్రో 89.45 మీటర్ల రికార్డును అధిగమించాడు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story