England vs Netherlands : నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ భారీ విజయం
ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు

Moeen Ali, Adil Rashid take 3 wickets apiece as ENG trounce NED by 160 runs
ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్(Netherlands)ను ఓడించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Maharashtra Cricket Association Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 339 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో ప్రపంచకప్(World Cup) నుంచి నిష్క్రమించిన నాలుగో జట్టుగా అవతరించింది.
ఇంగ్లండ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించి.. ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 10వ స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. నెదర్లాండ్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో ప్రపంచకప్‌కు దూరమైంది.
నెదర్లాండ్స్ తరఫున తేజ నిడమనూరు(Teja Nidamanuru) అత్యధికంగా అజేయంగా 41 పరుగులు చేశాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 38 పరుగులు, వెస్లీ బరేసి 37 పరుగులు చేశారు. సైబ్రాండ్ 33 పరుగులు, బాస్ డి లీడే 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు. డేవిడ్ విల్లీకి రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్(Benstokes) (108 పరుగులు) సెంచరీ చేశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ప్రపంచకప్ చరిత్రలో స్టోక్స్‌కు ఇదే తొలి సెంచరీ. డేవిడ్ మలన్(David Maan) 87 పరుగులు, క్రిస్ వోక్స్ 51 పరుగులు చేశారు. జో రూట్ 28, జానీ బెయిర్‌స్టో 15, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేశారు. డేవిడ్ విల్లీ ఆరు, జోస్ బట్లర్ ఐదు, మొయిన్ అలీ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. నెదర్లాండ్స్ తరఫున బాస్ డి లీడే మూడు వికెట్లు తీశాడు.
