ఆదివారం జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో భారత స్టార్ పారా అథ్లెట్లు నిషాద్ కుమార్, ప్రీతి పాల్ తమ తమ ఈవెంట్‌లలో రజత, కాంస్య పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు.

పారిస్ పారాలింపిక్స్‌లో భారత స్టార్ పారా అథ్లెట్లు నిషాద్ కుమార్, ప్రీతి పాల్ ఆదివారం తమ తమ ఈవెంట్‌లలో రజత, కాంస్య పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న నిషాద్ కుమార్.. పురుషుల T47 హైజంప్ ఈవెంట్‌లో సీజన్‌లో అత్యుత్తమంగా 2.04 మీటర్ల జంప్‌తో పారిస్‌లో తన ప్రదర్శనను పునరావృతం చేశాడు.

మహిళల 200 మీటర్ల T35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ 30.01 సెకన్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారిస్‌లో ఆమెకిది రెండో కాంస్యం. అంతకుముందు శుక్రవారం ఆమె మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్‌లో 14.21 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మీరట్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతికి పారిస్ పారా అథ్లెటిక్స్‌లో ఇది రెండో పతకం. ట్రాక్ ఈవెంట్‌లో ప్రీతి తొలిసారిగా దేశానికి పతకం సాధించి పెట్టింది.

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివ‌ర‌కూ ఏడు పతకాలు వచ్చాయి. వీటిలో ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యం ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో దేశ అథ్లెట్లు ఆరు పతకాలు మాత్రమే సాధించగా.. పారా అథ్లెట్లు ఇప్పటికే వాటిని అధిగమించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story