కొలంబోలోని టర్నింగ్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శ్రీలంక స్పిన్నర్ల ఉచ్చులో పడ్డారు. దీనివల్ల 27 ఏళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ మొదటి వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

కొలంబోలోని టర్నింగ్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శ్రీలంక స్పిన్నర్ల ఉచ్చులో పడ్డారు. దీనివల్ల 27 ఏళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ మొదటి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయితే.. స్లో అండ్ టర్నింగ్ పిచ్‌ల కోసం ఆటగాళ్ల ఎంపికపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు.

ఆటగాళ్ల నుంచి మనకు ఏం కావాలో చెప్పాలని.. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వస్తే.. దురదృష్టవశాత్తూ ఆ పని కూడా చేయగలమని రోహిత్ అన్నాడు. అన్ని పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయగల జట్టును సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తామ‌న్నారు.

స్పిన్నర్లను ఆడ‌టంలో మన బ్యాట్స్‌మెన్ నిలకడగా లేరు. మనం ఆడుతూ పెరిగిన పిచ్‌పై మన‌ ప్రదర్శన నిరాశపరిచినందున ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి గేమ్ ప్లాన్ ఉండాలని.. దానిని మైదానంలో ఉపయోగించాలని రోహిత్‌ చెప్పాడు.

శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై ప్రశంసలు కురిపించిన రోహిత్‌.. మూడు మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు నిలకడను ప్రదర్శించారని అన్నాడు. ఈ పిచ్‌పై ఎలాంటి భయం లేకుండా స్వీప్ షాట్‌లు ఆడి పరుగులు సాధించారు. అందులో మనం వెనుకబడ్డాం అన్నాడు.

మూడో ODIలో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ భారత బ్యాటింగ్‌ను సమర్థించాడు. మా బ్యాట్స్‌మెన్ మంచి ప్రదర్శన చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారని.. చాలా మంది వారి ఆటకు విరుద్ధంగా స్వీప్ షాట్‌లు కూడా ఆడారని చెప్పాడు. ప్రస్తుతం టీమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story