Shoaib-Sania : మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్..!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు.

Shoaib Malik Got Married For Second Time, Married Sana Javed
పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan Cricket Team) మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మరోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్(Sana Javed)తో తన వివాహాన్ని షోయబ్ స్వయంగా పోస్ట్ చేసి ధృవీకరించాడు. షోయబ్, సానియా మీర్జా(Sania Mirza)లు విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ హఠాత్తు పరిణామం చోటుచేసుకుంది. షోయబ్, సనా ఒక వేడుకలో వివాహం చేసుకున్నారు.
పాకిస్థాన్‌లోని ప్రముఖ నటీమణులలో ఒకరైన సనా జావేద్ కూడా విడాకులు తీసుకున్నారు. ఆమె 2020లో ఉమైర్ జస్వాల్(Umair Jaishwal)ని పెళ్లాడింది. అయితే ఎంతో కాలం వీరి బంధం నిలవలేదు.. దీంతో విడిపోయారు. 28 ఏళ్ల సనా పాకిస్థాన్‌లోని పలు టీవీ షోలలో కనిపించింది.
షోయబ్, సనాల మధ్య డేటింగ్ గురించి చాలా కాలం క్రితం వార్తలు వచ్చాయి. షోయబ్ ఇటీవల సనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్‌డే బడ్డీ! అని రాసిన షోయబ్ సనాతో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నాడు.
