హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో SRH-DC మధ్య జరిగిన 55వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో SRH-DC మధ్య జరిగిన 55వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. DC మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 133/7 స్కోర్ చేసింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో DCని ముందుగానే కట్టడి చేశాడు. వర్షం మధ్యలో రావడంతో ఆట సాయంత్రం నుంచి ఆగిపోయింది. గ్రౌండ్ సిబ్బంది, సూపర్ సోపర్స్ ఎంత ప్రయత్నించినా ఆట సాధ్యం కాలేదు. రాత్రి 11:10 గంటలకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది, కానీ ఇది SRHకి ప్లేఆఫ్స్ ఆశలను వదులకుంది. 10 మ్యాచ్‌లు ఆడిన SRH, 6 పాయింట్లతో 3 విజయాలు, 6 ఓటములు, 1 రద్దుతో 9వ స్థానంలో నిలిచింది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, అన్ని గెలిచినా 14 పాయింట్లే వస్తాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్(MI), గుజరాత్ టైటాన్స్(GT) , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 14 పాయింట్లు సాధించగా, పంజాబ్ కింగ్స్(Punjab Kings) 13 పాయింట్లతో ఉన్నాయి. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (SRH)నెట్ రన్ రేట్ -1.192 కూడా చాలా తక్కువగా ఉండటం వారి అవకాశాలను మరింత దెబ్బతీసింది. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి కీలక బ్యాట్స్‌మెన్‌లు ఉన్నప్పటికీ, బలమైన ప్రదర్శనలు చేయలేదు. కొన్ని మ్యాచ్‌లలో టాప్ ఆర్డర్ విఫలమవడం SRHకి భారీ స్కోర్లు చేయడంలో అడ్డంకిగా నిలిచింది. పాట్ కమిన్స్(Pat Cummins), మొహమ్మద్ షమీ(Mohammed Shami), హర్షల్ పటేల్(Harshal Patel) లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ, బౌలింగ్ యూనిట్ స్థిరంగా రాణించలేదు. షమీ ఈ సీజన్‌లో తన లైన్ అండ్ లెంగ్త్‌లో సమస్యలు ఎదుర్కొన్నాడు. స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్(Rahul Chahar), ఆడమ్ జంపా(Adam Zampa) వంటి ఆటగాళ్లు ఉన్నా కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

ehatv

ehatv

Next Story