Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ.. భవిష్యత్ భారత ఓపెనర్..!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సాధించిన సూర్యవంశీ (Vaibhav Suryavanshi)సెంచరీ కొట్టాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సాధించిన సూర్యవంశీ (Vaibhav Suryavanshi)సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శన IPL చరిత్రలో ఒక సంచలనంగా మారింది. జస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్‌తో ఈ పోరు జరిగింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 20 ఓవర్లలో 209/4 స్కోరు చేసింది రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 15.5 ఓవర్లలో 210/2 చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది, ఇందులో వైభవ్ సూర్యవంశీ 101 (38 బంతులు) కీలకంగా వ్యవహరించాడు. వైభవ్ ఇన్నింగ్స్ 38 బంతుల్లో 101 రన్స్, 11 సిక్సర్లు, 7 ఫోర్లు. వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో 11 సిక్సర్లు కొట్టాడు, ఇది ఒక భారతీయ బ్యాట్స్‌మన్‌గా IPL ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 2010లో 11 సిక్సర్లతో సమానంగా రికార్డు సృష్టించాడు.
ఇప్పుడు అతని సిక్సర్ల తొలి సిక్స్ ఒకటో ఓవర్, మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ తన ఇన్నింగ్స్‌ను ధీటుగా ప్రారంభించాడు. సిరాజ్ వేసిన మూడవ బంతిని సిక్సర్‌గా మలిచాడు. అతను 12వ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో 101 (38 బంతులు) వద్ద ఔటయ్యాడు. అయినప్పటికీ, అతను యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)తో కలిసి 166 రన్స్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, ఇది RR చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. వైభవ్ కొన్ని సిక్సర్లు 90 మీటర్లకు పైగా ఉన్నాయి, ఇవి అతని బలమైన బ్యాట్ స్వింగ్, టైమింగ్‌ను సూచిస్తాయి. వైభవ్ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్‌లు, మిడ్-వికెట్ స్లాగ్‌లు, మరియు ఆఫ్-సైడ్ లాంగ్ షాట్‌లతో 360-డిగ్రీ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. టీ20 అతిపిన్న వయస్సులో సెంచరీ సాధించాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయస్సులో సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో క్రిస్ గేల్ (30 బంతులు, 2013) తర్వాత, భారతీయుడిగా అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. యూసుఫ్ పఠాన్ (37 బంతులు, 2010) రికార్డును ఇది అధిగమించింది.
