Virat Kohli : టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..!
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 మే 12న అధికారికంగా తన రిటైర్మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 మే 12న అధికారికంగా తన రిటైర్మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇంగ్లండ్(England)తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఇది క్రికెట్ అభిమానులకు షాక్‌గా మారింది. అతను ఇకపై భారత్ తరఫున వన్డేలు మాత్రమే ఆడతాడని సమాచారం. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరిత పోస్ట్‌లో తన 14 ఏళ్ల టెస్టు కెరీర్‌ను గుర్తు చేసుకున్నాడు. "14 ఏళ్ల క్రితం తొలిసారి టెస్టు జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, జీవిత పాఠాలు నేర్పించింది" అని పేర్కొన్నాడు.
కాగా కోహ్లీ (Virat Kohli)123 టెస్టు మ్యాచ్‌లలో 9,230 పరుగులు (సగటు 46.85), 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా 68 మ్యాచ్‌లలో 40 విజయాలు, భారత్(India)కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా రికార్డు. రోహిత్ శర్మ(Rohit sharma) గత వారం టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత, కోహ్లీ కీలక ఆటగాడిగా ఉంటాడని అంతా భావించారు. 10,000 టెస్టు పరుగుల మైలురాయికి 770 పరుగుల దూరంలో ఉండగా రిటైర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్‌తో 2025-27 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సిరీస్‌లో భారత జట్టు అవకాశాలపై ప్రభావం పడవచ్చని ఆందోళనలు. మాజీ ఆటగాళ్లు అంబటి రాయుడు, బ్రియాన్ లారా వంటివారు కోహ్లీని రిటైర్మెంట్ పునరాలోచించమని కోరారు, జట్టుకు అతని అనుభవం అవసరమని పేర్కొన్నారు. కొంతమంది 10,000 పరుగుల రికార్డు కోసం కొనసాగాలని కోరుకున్నారు. సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ మనసు మార్చగలడని కొందరు భావిస్తున్నారు. కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అసాధారణ రికార్డులు, నాయకత్వంతో భారత క్రికెట్‌కు అపార సేవలందించాడు. ఇప్పుడు అతను వన్డేలపై దృష్టి పెడతాడని తెలుస్తోంది
