రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 17 ఏళ్లుగా ఎన్నోసార్లు ఓటమి, ట్రోల్స్ ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 17 ఏళ్లుగా ఎన్నోసార్లు ఓటమి, ట్రోల్స్ ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. రజత్ పాటిదార్ (Rajat Patidar)నాయకత్వంలోని బెంగళూరు(Bengaluru), ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో, జట్టు IPL 2025 ఛాంపియన్‌గా నిలిచింది. కృనాల్ పాండ్యా, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ చిరస్మరణీయమైన స్పెల్‌ల బలంతో, బెంగళూరు 190 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకుంది. మ్యాచ్‌ను 6 పరుగుల తేడాతో గెలుచుకుంది. దీంతో, జట్టు మాజీ కెప్టెన్, మొదటి సీజన్ నుంచి జట్టులో భాగమైన విరాట్ కోహ్లీ కూడా చివరకు IPL ఛాంపియన్‌గా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటి టైటిల్ గెలిచినప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ క్షణం అతనికి చాలా స్పెషల్‌గా ఉంది. అనుష్క శర్మ(Anushka Sharma)తో హగ్ చేసుకుని, ఏడుస్తూ చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు

Updated On
ehatv

ehatv

Next Story