రెసిషన్‌ (Rescission) కారణంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు లే ఆఫ్‌లు (Lay offs) ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ బాటలోనే గత ఏడాది 12 వేల ఉద్యోగులను తొలగించిన దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌ (Google) ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

రెసిషన్‌ (Rescission) కారణంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు లే ఆఫ్‌లు (Lay offs) ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ బాటలోనే గత ఏడాది 12 వేల ఉద్యోగులను తొలగించిన దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌ (Google) ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గూగుల్‌ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని.. మరికొన్ని కంపెనీలు గూగుల్ బాట పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవరపడుతున్నారు.

యాడ్స్‌ (Advertisements) విభాగాంలో ఏఐ (Artificial Intelligence)ని ఉపయోగించడమే కారణంగా లే ఆఫ్‌లను ప్రకటించే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకొని కొత్త ఒరవడులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యాడ్స్‌ విభాగంలో దీని పాత్ర ఎక్కువగా ఉంటుంది. దీంతో గత ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలించింది. ఈ ఏడాది మరో 30 వేల (Thirty Thousand) ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. యాడ్స్‌ విభాగంలో ఏఐ టూల్స్‌ వాడడం వల్ల కంపెనీకి రెవెన్యూ పెరగడం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఉద్యోగులు చేసే పని కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. యాడ్స్‌ విభాగంలో వెబ్‌సైట్లను క్షుణ్ణంగా స్కాన్‌ చేసి యాడ్స్ డెవలప్మెంట్‌ చేసే పనిని ఏఐ సమర్థవంతంగా నిర్ణయిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలించేందుకు సిద్ధమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated On 24 Dec 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story