బజాజ్‌ చేతక్‌ ఒకప్పటి డ్రీమ్‌ బైక్.

బజాజ్‌ చేతక్‌ ఒకప్పటి డ్రీమ్‌ బైక్. ఒకనాడు స్కూటర్లకు పెట్టింది పేరు బజాజ్ ఆటో. 1990లో పుట్టినవారందరికీ బజాజ్‌చేతక్ (Bajaj Chetak)అనుభవం ఉండి ఉంటుంది. అంతెందుకు ఇప్పటికీ నగరంలో, పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా బజాజ్‌ చేతక్‌ స్కూటర్లు కనిపిస్తాయి. అయితే తాజాగా బజాజ్ ఆటో తన ఈవీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. తొలుత 2020 జనవరి 14న తొలి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Chetak electric scooter)మార్కెట్లోకి తెచ్చింది. ఈ సంస్థ క్రమంగా విక్రయాల్ని పెంచుకుంటోంది. చేతక్‌కు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో త్వరలోనే దాని కొత్త వెర్షన్‌ను లాంచ్‌ చేయాలని చూస్తోంది. అధునాతన ఫీచర్లతో డిసెంబర్‌ 20 నాటికి కొత్త చేతక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఎథేర్‌ వంటి కంపెనీలతో బజాజ్‌ పోటీ ఎదుర్కొంటోంది. ఫ్లోర్‌ బోర్డుపై బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఫ్రెష్‌ చేసిస్ వస్తుంది. దీని బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 123 కి.మీ నుంచి 137 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం పాత స్కూటర్‌ ధర రూ.95,997 నుంచి రూ.1,28,744 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కొత్త మోడల్ ధర పెరిగే అవకాశం ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story