చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌లో సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో డాక్టర్ లిన్ షాన్‌ఫెంగ్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ‘బోన్-02' ఆవిష్కరించారు.

చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌లో సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో డాక్టర్ లిన్ షాన్‌ఫెంగ్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ‘బోన్-02' ఆవిష్కరించారు.ఈ బయోమెడికల్ ఆవిష్కరణ ఎముకల ఫ్రాక్చర్ రిపేర్‌లో రివల్యూషనరీ అడుగు. బోన్-02 అంటే ఏమిటి..}‘బోన్-02’ అనేది ఒక బయో-అబ్సార్బబుల్ (శరీరంలో కరిగిపోయే) అడెసివ్ లేదా బోన్ గ్లూ, దీనిని విరిగిన ఎముకలను అతికించడానికి ఉపయోగిస్తారు. ఇది సాంప్రదాయ మెటల్ ప్లేట్లు, స్క్రూలు లేదా సైనోయక్రిలేట్ గ్లూలకు ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. అధికంగ రక్తం ప్రవహించే ప్రాంతాల్లో కూడా 2-3 నిమిషాల్లో ఎముకలను బలంగా అంటుకుని, హీలింగ్‌ను వేగవంతం చేస్తుంది. విరిగిన ఎముకల మధ్య చిన్న కట్ (2-3 సెం.మీ.) ద్వారా ఈ గ్లూను ఇంజెక్ట్ చేస్తారు. తక్షణం అంటుకుంటుంది, 2-3 నిమిషాల్లో ఎముకల మధ్య బలంగా జాయింట్‌ అవుతుంది. శస్త్రచికిత్స సమయంలో సర్జన్‌కు సులభంగా ఎముకలను సరిచేసే సౌలభ్యం ఇస్తుంది.

ఈ గ్లూ శరీరంలో 6 నెలల్లో కరిగిపోతుంది. ఎముక హీల్ అయ్యే వరకు మద్దతు ఇచ్చి, తర్వాత కరిగిపోతుంది. రోగనిరోధక వ్యవస్థను మోడ్యులేట్ చేస్తుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఎముక ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో 150 మందికిపైగా రోగులపై ట్రయల్స్ జరిగాయి. సర్జరీ సమయం తగ్గింది, రోగుల రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. 2-3 నిమిషాల్లో ఎముకల మధ్య బంధన ఏర్పడుతుంది. 6-8 వారాల్లో ఎముక రికవరీ అవుతుంది. చిన్న కట్‌తో ఇంజెక్ట్ చేయవచ్చు, మెటల్ ఇంప్లాంట్లు అవసరం లేదు. సంక్లిష్ట ఫ్రాక్చర్లు, డెంటల్ రిపేర్, ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఉపయోగపడుతుంది. సర్జరీ సమయం, ఖర్చు తగ్గుతాయి. ఈ గ్లూ ఆర్థోపెడిక్ సర్జరీలను సరళీకరిస్తుంది. సంక్లిష్ట ఫ్రాక్చర్లు, ఆస్టియోపొరోసిస్ రోగులకు గేమ్-చేంజర్ అవుతుంది. అమెరికా, భారత్, యూరప్‌లోని ఆర్థోపెడిస్టుల దృష్టిని ఆకర్షించింది. డెంటల్ ఇంప్లాంట్స్, స్పైనల్ రిపేర్, బయోమెటీరియల్ రీసెర్చ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్‌లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్‌ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్‌ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది.

Updated On
ehatv

ehatv

Next Story