గూగుల్ విడుదల చేసిన ఎక్స్‌పెరిమెంటల్ యాప్, ఇది స్మార్ట్‌ఫోన్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను ఆఫ్‌లైన్‌లో రన్ చేయడానికి ఉపయోగపడుతుంది.

గూగుల్ విడుదల చేసిన ఎక్స్‌పెరిమెంటల్ యాప్, ఇది స్మార్ట్‌ఫోన్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను ఆఫ్‌లైన్‌లో రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ గూగుల్‌ ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ (Google AI Edge Gallery)అనేది ఒక ఓపెన్-సోర్స్ యాప్, ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్ల(Android AI models)లో జెనరేటివ్ ఏఐ (Generative AI)మోడల్స్‌ను ఆఫ్‌లైన్‌లో (Offline AI app)రన్ చేయడానికి రూపొందించబడింది. ఇది మీ ఫోన్‌లోనే AI పవర్‌ను ఉపయోగించడానికి ఒక "ప్లేగ్రౌండ్" లాంటిది, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఒకసారి AI మోడల్ డౌన్‌లోడ్ చేస్తే, ఇంటర్నెట్ లేకుండా పూర్తిగా ఫోన్‌లో రన్ అవుతుంది. ఇది డేటా ప్రైవసీని పెంచుతుంది, ఇది డేటా క్లౌడ్ సర్వర్‌కు వెళ్లదు. ఫోటో అప్‌లోడ్ చేసి, దాని గురించి ప్రశ్నలు అడగవచ్చు. టెక్స్ట్ సమ్మరైజేషన్, రీరైటింగ్, కోడ్ రాయడం వంటి సింగిల్-టర్న్ టాస్క్‌ల కోసం రూపొందించారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు, బెంచ్‌మార్క్ చూడవచ్చు. డేటా క్లౌడ్‌కు వెళ్లకుండా ఫోన్‌లోనే ప్రాసెస్ అవుతుంది, ఇది ప్రైవసీకి బాగా ఉపయోగపడుతుంది. డెవలపర్లకు AI మోడల్స్‌ను టెస్ట్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి ఒక సులభమైన ప్లాట్‌ఫారమ్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి గూగుల్ డెవలపర్ కమ్యూనిటీని ప్రోత్సహిస్తోంది. AI మోడల్స్‌ను టెస్ట్ చేయడానికి, కోడ్ రాయడానికి, లేదా కస్టమ్ యాప్‌లలో ఇంటిగ్రేట్ చేయడానికి. చాట్‌బాట్‌తో సంభాషణలు, ఇమేజ్ ఆధారిత ప్రశ్నలు, లేదా టెక్స్ట్ సమ్మరైజేషన్ కోసం రూపొందించారు. గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్‌ మోడల్‌పై ఆధారపడి ఈ యాప్‌ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను క్షణాల్లో జనరేట్‌ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట​్‌ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.

ehatv

ehatv

Next Story