ఈ డిజిటల్ యుగంలో, AI రోజురోజుకు తన పనితీరుతో దూసుకెళ్తుంది. AIతో చాలా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్నా కానీ దాని పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ డిజిటల్ యుగంలో, AI రోజురోజుకు తన పనితీరుతో దూసుకెళ్తుంది. AIతో చాలా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్నా కానీ దాని పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఊరటనిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. AI కి సంబంధించిన ఇటీవలి ఒక సంఘటనలో, వైద్యులు కూడా గుర్తించలేని ఒక ప్రాణాంతక లోపాన్ని గ్రోక్ (Grok) పట్టేసుకుంది. 49 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా, వైద్యులు దానిని ఎసిడిటీ అని చెప్పి ఇంటికి పంపించారు. కానీ ఎంతకూ నొప్పి తగ్గకపోవడంతో, తన బాధనంతా ఆ వ్యక్తి గ్రోక్‌కు వివరించాదడు. దీంతో గ్రోక్‌ అలెర్ట్ చేసింది. నీకున్న లక్షణాలను బట్టి అపెండిక్స్ ప్రమాదం ఉండొచ్చని, వెంటనే వెళ్లి సిటీ స్కాన్ చేయాల్సిందే అని నొక్కి వక్కాణించింది.

సోషల్ మీడియా X లో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో, ఒక యూజర్ రోగి తన కథను వివరించారు. 24 గంటల పాటు రోగికి కడుపులో భరించలేని నొప్పి రావడంతో అతను కదలకుండా పడుకుండిపోయాడు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లగా కడుపును కొద్దిగా నొక్కి, గ్యాస్‌ నొప్పి అంటూ ఏవో మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ మందులతో నొప్పి తగ్గలేదు, మరింత తీవ్రంగానే ఉంది. పెరుగుతున్న నొప్పితో విసిగిపోయిన ఆ వ్యక్తి తన Grok AI చాట్‌ను తెరిచి, తన లక్షణాలన్నీ చెప్పాడు. దానికి Grok వెంటనే బదులిచ్చింది. Grok తక్షణమే అల్సర్ లేదా అపెండిక్స్‌ను సూచించిందని, వెంటనే వెళ్లి ఒక సిటి స్కాన్ చేయించుకోవాలని Grok సలహా ఇచ్చింది.

Grok సూచనతో మళ్లీ అత్యవసర ఆసుపత్రికి చేరుకున్నాడు. తనకు వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాలని పట్టుబట్టాడు. సిటీ స్కాన్‌లో చివరకు అది సాధారణ ఎసిడిటీ కాదని, పగిలిపోయే దశలో ఉన్న అపెండిక్స్ అని స్పష్టమైంది. ఆ తర్వాత వెంటనే శస్త్రచికిత్స చేసి అపెండిక్స్‌ను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిందని రోగి తెలిపారు. దీంతో ఆ వ్యక్తి AI కి కృతజ్ఞతలు చెప్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు కూడా AIని ప్రశంసిస్తున్నారు. దేవుడిలా కొలిచే వైద్యులే తప్పులు చేస్తే, ప్రాణాలకే ప్రమాదం కదా, ఇంత నిర్లక్ష్యం అవసరమా అని కొందరు వైద్యులను విమర్శిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story