మివి అనేది హైదరాబాద్‌లో 2016లో స్థాపించబడిన ఒక భారతీయ టెక్ స్టార్టప్, పూర్తిగా ఆడియో ప్రొడక్ట్స్‌పై ఫోకస్ చేస్తుంది.

మివి అనేది హైదరాబాద్‌లో 2016లో స్థాపించబడిన ఒక భారతీయ టెక్ స్టార్టప్, పూర్తిగా ఆడియో ప్రొడక్ట్స్‌పై ఫోకస్ చేస్తుంది. దీని ఫౌండర్లు విశ్వనాథ్ కందుల, మిధుల దేవభక్తుని. వీళ్లు ఇయర్‌బడ్స్, స్పీకర్స్, సౌండ్‌బార్స్, స్మార్ట్‌వాచ్‌ల వంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, అవి 100% మేడ్-ఇన్-ఇండియా అని చెప్పుకుంటారు. మివి గతంలో బోట్, JBL వంటి బ్రాండ్స్‌తో కంపీట్ చేస్తూ, సరసమైన ధరల్లో క్వాలిటీ ఆడియో ప్రొడక్ట్స్ ఇవ్వడంలో పేరు తెచ్చుకుంది. 2024-25 నాటికి వీళ్లు రూ. 200 కోట్లతో హైదరాబాద్‌లో కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేశారు.
Mivi తాజాగా మివి ఏఐ(Mivi AI) అనే కొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది, ఇది ఆడియో డివైసెస్‌లో రివల్యూషన్ తీసుకొస్తుందని చెప్పుకుంటోంది.
ఇది ఒక హ్యూమన్-లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే సాధారణ చాట్‌బాట్‌ల లాగా కాకుండా, మనతో మనిషిలా మాట్లాడగలదు, మన ప్రాధాన్యతలను గుర్తుంచుకుంటుంది, సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. మనం వంట గురించి మాట్లాడుతూ మధ్యలో వార్తల గురించి అడిగినా, అది తిరిగి వంట రెసిపీకి సీమ్‌లెస్‌గా కనెక్ట్ చేస్తుంది.
మివి.. AIని ఇంటిగ్రేట్ చేసిన మొదటి ప్రొడక్ట్ ఇవి. ఈ ఇయర్‌బడ్స్ "Hi Mivi" అని చెప్పగానే యాక్టివేట్ అవుతాయి, హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇందులో "అవతార్స్" అనే ఫీచర్ ఉంది. చెఫ్ అవతార్ వంటలో ఎక్స్‌పర్ట్, న్యూస్ రిపోర్టర్ అవతార్.. ఇంట్రెస్ట్ ప్రకారం వార్తలు చెప్తుంది, వెల్‌నెస్ కోచ్ అవతార్. ఇది వేలకొద్దీ ఇండియన్ యాక్సెంట్‌లను గుర్తించగలదు, దీనివల్ల తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సులభంగా కమ్యూనికేట్ చేయగలదు. Mivi AI నీ ప్రతి సంభాషణను Mivi AI యాప్‌లో స్టోర్ చేస్తుంది, నీ లైక్స్, డిస్‌లైక్స్ స్పైసీ ఫుడ్ ప్రిఫరెన్స్, న్యూస్ జానర్ గుర్తుంచుకుని, తర్వాత సూచనలను చేస్తుంది.
