గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో ఆంధ్ర-కర్ణాటక మధ్య వాగ్వాదానికి దారితీసింది.

గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో ఆంధ్ర-కర్ణాటక మధ్య వాగ్వాదానికి దారితీసింది. నారా లోకేష్, ప్రియాంక్ ఖర్గే మధ్య ట్వీట్ల వార్ నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను స్థాపించడానికి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని గూగుల్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్-కర్నాటక నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే Xలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు, "ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కొంచెం స్పైసీని ఆస్వాదిస్తారు, కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని సిఫార్సు చేసినట్లే, ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్‌ను సమర్థిస్తారు." పొరుగువారి" అప్పులు దాదాపు రూ. 10 లక్షల కోట్లకు పెరిగాయని, రెవెన్యూ లోటు 2.65 శాతం నుండి 3.61 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు'' దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఖర్గే ట్వీట్‌కు ప్రతిస్పందనగా మరో ట్వీట్ వేశారు. "ఆంధ్రలో ఫుడ్ స్పైసీగా ఉంటుందని.. మా రాష్ట్రంలో పెట్టుబడులలో కొన్ని కూడా అలాగే ఉన్నాయని అనిపిస్తుందన్నారు. కొంతమంది పక్కరాష్ట్రం వారికి మండుతున్నట్లు ఉందని పోస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన కర్ణాటక నాయకులను విమర్శిస్తూ, "వారు అసమర్థులైతే, నేను ఏమి చేయగలను? వారి స్వంత పారిశ్రామికవేత్తలు, మౌలిక సదుపాయాలు లేవని విద్యుత్ కోతలు ఉన్నాయని అంటున్నారు. పొరుగు రాష్ట్రం వారు ముందుగా ఆ సమస్యలను పరిష్కరించాలి" అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
