కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్(Warangal Railway Station) సుందరంగా రూపుదిద్దుకుంది.

కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్(Warangal Railway Station) సుందరంగా రూపుదిద్దుకుంది. మే 22న పునః ప్రారంభానికి సిద్ధమవుతోన్న ఈ రైల్వే స్టేషన్ ఫొటోలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో షేర్ చేసుకున్నారు. ‘అమృత్ స్టేషన్ వరంగల్.. 2024 ఫిబ్రవరిలో పనులకు శంకుస్థాపన జరగ్గా.. మే 2025 నాటికి పనులు పూర్తి కావొచ్చాయి’’ అని పేర్కొంటూ గతంలో ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉందో పోల్చేలా పలు చిత్రాలను షేర్ చేశారు.
వరంగల్ రైల్వే స్టేషన్‌ను మే 22న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పునః ప్రారంభిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనే ఈ కార్యక్రమానికి తనకు ప్రత్యేక ఆహ్వానం అందిందని ఆమె పేర్కొన్నారు.
వరంగల్‌లో ఎస్కలేటర్లు, విశాలమైన పాదచారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణం తదితర వసతులు వరంగల్‌లో కల్పించారు
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం రూ.25.11 కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దారని, ఇంకా కాజీపేటలో పనులు వేగంగా జరగాల్సి ఉందని ఎంపీ కావ్య తెలిపారు.
