PSLV-C62 Failed: ఇస్రోను వెంటాడుతున్న వరుస వైఫల్యాలు..! తాజాగా మరో ప్రయోగం ఫెయిల్..!

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10:18 గంటలకు శ్రీహరికోట నుంచి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన 18 నిమిషాల తర్వాత శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవాల్సి ఉంది. అయితే, మూడవ దశ (Third Stage) చివరలో గ్రౌండ్ స్టేషన్‌తో రాకెట్ సంబంధాలు తెగిపోయాయి. ఇస్రో చేపట్టిన ఈ ఏడాది తొలి ప్రయోగం PSLV-C62 దురదృష్టవశాత్తూ విఫలమైంది.
ఇస్రో వరుస వైఫల్యాలను ఎదుర్కొంటోంది. 2025 మే 18న PSLV-C61, 2026 జనవరి 12న PSLV C-62. రెండు సందర్భాలలోనూ, ఇస్రో జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఉపగ్రహాలను కోల్పోయింది. మూడవ దశలో లోపం కారణంగా PSLV-C61, PSLV-C62 విఫలం కావడం గమనార్హం. PSLV 33 సంవత్సరాలలో 64 సార్లు ప్రయోగించగా వాటిలో నాలుగు వైఫల్యాలను ఎదుర్కొంది. ముఖ్యంగా, 2025 వైఫల్యం, తాజాగా నాలుగు-దశల స్పేస్‌ఫేరింగ్ వైఫల్యం చెందింది.
ఈ సందర్బంగా ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ, "మేము PSLV-C62 మిషన్‌ను ప్రయత్నించాము. PSLV నాలుగు దశల రాకెట్. మూడవ దశ చివరి వరకు దాని పనితీరు ఊహించిన విధంగానే ఉంది. మూడవ దశ ముగిసే సమయానికి, గ్రహంలో ఒక అవాంతరం గమనించమన్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామన్నారు. అయితే మే-25లో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ 61 విఫలమైన తర్వాత ఇంతవరకు ఆ నివేదికను బహిరంగపర్చలేదన్న చర్చకూడా ఉంది. ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలకు చెందిన విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడంలో ISRO పాత్రను దృష్టిలో ఉంచుకుని, పారదర్శకతను కొనసాగించడానికి, తిరిగి ఇస్రోపై నమ్మకం కుదిరేందుకు FAC నివేదికలను బహిరంగపరచడం చాలా కీలకం.


