వాట్సప్‌లో(Whats app) ఎవరో వాయిస్ మెసేజ్(Voice message) పంపించారు.

వాట్సప్‌లో(Whats app) ఎవరో వాయిస్ మెసేజ్(Voice message) పంపించారు. అప్పటికప్పుడు దాన్ని వినటం కుదరకపోవచ్చు. చుట్టుపక్కల పరిస్థితులూ అనువుగా లేకపోవచ్చు. మరెలా? ఇలాంటి ఇబ్బందిని తప్పించేందుకు వాట్సాప్‌ కొత్త ఫ్యూచర్‌(New Features) తీసుకొచ్చింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్లను అక్షరాల రూపంలోకి(Text convert) మార్చే వెసులుబాటును కల్పించింది. వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ ఫీచర్ చాలా కాలంగా ఉంది. పెద్ద మెసేజ్‌లను వేగంగా వినటానికి స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వచ్చింది. తాజా ట్రాన్స్కిప్షన్‌(Transcription) ఫీచర్‌తో ఇప్పుడు దాన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవడమూ సాధ్యమవుతుంది. వాయిస్ మెసేజ్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని అక్షరాల రూపంలోకి మార్చి, చదువుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. చదవాలనుకునే వారికిది అనువుగానూ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాలు రెండింటిలోనూ ట్రాన్స్కిప్షన్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతానికిది ఇంగ్లిష్, పోర్చుగీస్, స్పానిష్, రష్యన్ భాషలను సపోర్టు చేస్తోంది. త్వరలోనే భారతీయ భాషలకూ తీసుకురావాలని భావిస్తున్నారు. యాపిల్ గత సంవత్సరమే ఐ మెసేజెస్‌లో ట్రాన్స్కిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలిగ్రామ్ సైతం ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. అయితే చందా కట్టినవారికే ఇది వర్తిస్తుంది. అదే సమయంలో వాట్సాప్‌ ట్రాన్స్కిప్షన్ ఫీచర్‌ను ఉచితంగానే అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story