ఈ మధ్య కాలంలో గురుకులాల్లో(Gurukulam) పాములు(Snake) కరిచి విద్యార్థి మరణించిన ఘటన జగిత్యాల(Jagitial) జిల్లాలో చోటుచేసుకుంది

ఈ మధ్య కాలంలో గురుకులాల్లో(Gurukulam) పాములు(Snake) కరిచి విద్యార్థి మరణించిన ఘటన జగిత్యాల(Jagitial) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన మరవకముందే విద్యార్థులను ఎలుకలు కర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ(Nalgonda) జిల్లాలోని ఓ గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి.

రెండు రోజుల కింద దేవరకొండ(Devarkonda) మండలం కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రాత్రి పడుకున్న విద్యార్థులను ఎలుకలు(Rats) కరవడంతో 13 మందికి గాయాలయ్యాయి. ఉదయం గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రెండు రోజుల కింద ఘటన జరిగిన ఈ విషయం గోప్యంగా ఉంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story