భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వాయనాడ్‌లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విధ్వంసానికి గుర‌య్యాయి.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వాయనాడ్‌లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విధ్వంసానికి గుర‌య్యాయి. ఇప్పటివరకూ 300 మందికి పైగా మరణించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, కేరళలోని వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజల సహాయార్థం తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణి శ్రీ మూడు గంటల పాటు నిరంతరంగా భరతనాట్య ప్ర‌ద‌ర్శ‌న‌ చేసింది. ఆ బాలిక‌ గురువారం తన వంతుగా రూ.15,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎండీఆర్‌ఎఫ్) విరాళంగా ఇచ్చింది.

కేరళ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ (IPRD) తన అధికారిక హ్యాండిల్‌లో.. తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణి శ్రీ వాయనాడ్ బాధితుల స‌హాయార్థం.. నిధుల సేకరణకై 3 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. తన దాచుకున్న డ‌బ్బుల‌తో సహా రూ.15వేలను సీఎండీఆర్‌ఎఫ్‌కు విరాళంగా అందించింద‌ని పేర్కొంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాలికను క‌లిసి ఆశీర్వదించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story