ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించిన ఉన్మాది.. అవి భరించలేక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించిన ఉన్మాది.. అవి భరించలేక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్(KarimNagar) జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్‌కు చెందిన కిల్లి కుమారస్వామి(Kumara Swamy), వసంత(Vasanta) కూతురు వరుణప్రియ(Varun Priya) (18) ఉంది. ఆమె హన్మకొండలోని మహిళా కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అయితే వరుణ ప్రియను అదే గ్రామానికి చెందిన అజయ్(Ajay) (19) మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధించసాగాడు. ఇదే విషయంపై వరుణ తల్లిదండ్రులు అజయ్‌ను పలు సార్లు హెచ్చరించారు. అయినా అతను అదే పని చేశాడు. అతనిలో మార్పురాకపోగా ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి. తండ్రి కుమారస్వామి కూతురు వరుణప్రియను పెద్దపాపయ్యపల్లిలో ఉన్న ఆమె అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు. ఇంట్లో అందరు వ్యవసాయపనులకు వెళ్లిపోయారు. తిరిగివచ్చే సరికి వరుణప్రియ ఉరివేసుకొని ఉంది. అజయ్ వేధింపుల వల్లే తన కూతురు ప్రాణాలు తీసుకుందని పోలీసులకు కుమారస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
