ఆమె వయసు 30 సంవత్సరాలు.. అతని వయసు 19. తన కంటే 11 ఏళ్లు చిన్న వయసు ఉన్నవాడిని ప్రేమించింది.

ఆమె వయసు 30 సంవత్సరాలు.. అతని వయసు 19. తన కంటే 11 ఏళ్లు చిన్న వయసు ఉన్నవాడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్‌పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్‌ ప్రేమించుకొని జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్‌ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్‌ను కుటుంబ సభ్యులు ఆమెపై లేనిపోని కథనాలను చెప్పారు. దీంతో సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story