హైదరాబాద్‌లోని మధురానగర్‌లో పవన్ కుమార్(Pawan Kumar) (37) మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది.

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో పవన్ కుమార్(Pawan Kumar) (37) మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ మృతి అనుమానాస్పదంగా భావించబడినప్పటికీ, తర్వాత విచారణలో కొన్ని వివరాలు స్పష్టమయ్యాయి. మధురానగర్(Madhura Nagar)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్ కుమార్ తన పెంపుడు కుక్కతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 4న రాత్రి, పవన్ స్నేహితుడు అతని ఇంటికి వచ్చి తలుపు తట్టగా స్పందన రాలేదు. చుట్టుపక్కల వారితో కలిసి తలుపు పగలగొట్టి చూడగా, పవన్ రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నాడు. అతని పెంపుడు కుక్క నోటిలో రక్తంతో, పవన్ శరీరంపై గాయాలతో కనిపించింది. పవన్‌ను కుక్క కొరికి చంపిందని, ముఖ్యంగా అతని మర్మాంగాలపై గాయాలు ఉండటంతో స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది... అనేక ఊహాగానాలకు దారితీసింది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, పవన్ అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించాడని నిర్ధారణ అయింది. అతని పెంపుడు కుక్క, యజమానిని లేపేందుకు లేదా కాపాడేందుకు ప్రయత్నించి, శరీరంపై కొరికినట్లు తేలింది. ఈ ప్రయత్నంలోనే గాయాలు, రక్తం కనిపించాయి. కుక్క పవన్‌ను చంపలేదని, అతను మరణించిన తర్వాత ఈ గాయాలు ఏర్పడ్డాయని వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. వైద్య నివేదిక ఆధారంగా, ఇది హత్య కాదని, అనారోగ్యం వల్ల సహజ మరణంగా భావిస్తున్నారు. అయినా కూడా పవన్ మృతిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసహజ లైంగిక చర్యకు ఏమైనా పాల్పడి ఉంటే కుక్క గాయపర్చి ఉండొచ్చనే అనుమానం కూడా కలుగుతోంది.
