4 Thousand Pensions: Pension hike coming soon.. Since when does a pension of Rs. 4 thousand mean..!

తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌ను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల్లో భాగంగా వృద్ధులకు పెన్షన్‌ పెంచుతామని ఎన్నికల్లో ప్రధానంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పెన్షన్‌ పెంచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత KCR కూడా ఈ మధ్య ప్రెస్‌మీట్‌లో దీనిని లేవనెత్తారు. సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా పెన్షన్ల పెంచకపోవడం అనేది ప్రధాన వ్యతిరేకతగా కనపడింంది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని ప్రభుత్వం నుంచి హింట్‌ వస్తోంది. దీంతో పింఛన్ల మొత్తాన్ని పెంచాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఈ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందుతున్న పింఛన్లను పెంచేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెంపు అమలు చేయాలన్న ఆలోచనపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అయితే ట్విస్ట్‌ ఏంటంటే ఒకేసారి 2 వేలు పెంచకుండా రూ.500 పెంపా? రూ.1000 పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్లను ఎంత మేర పెంచాలన్న విషయంపై ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి రూ.500 పెంచాలా లేక రూ.1000 వరకు పెంచాలా అన్న అంశంపై లోతైన చర్చ సాగుతోంది. ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story